News May 2, 2024

IPL: రాజస్థాన్‌కు షాక్.. SRH విజయం

image

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR 200 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్(77), జైస్వాల్(67) అర్ధసెంచరీలు చేశారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.

Similar News

News April 11, 2026

అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం

image

ఇస్లామాబాద్ వేదికగా పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ బఘేర్ ఆధ్వర్యంలోని బృందం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం వేర్వేరుగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌తో భేటీ అయ్యాయి. మరికాసేపట్లో ఇరు బృందాలు ఫేస్ టు ఫేస్ చర్చలు జరపనున్నాయి. ఇరాన్ 10 పాయింట్ల డిమాండ్‌పైనే ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.

News April 11, 2026

పొట్టపై నల్లటి గీత ఉంటే అబ్బాయి పుడతారా?

image

గర్భధారణ సమయంలో పొట్టపై కనిపించే నల్లటి గీతను ‘లీనియా నిగ్రా’ అంటారు. ఈ గీత ఉంటే అబ్బాయి పుడతారని చాలామంది నమ్ముతారు. కానీ ఇది అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ‘శరీరంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల మార్పుల వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఇలా నల్లగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. ప్రసవం తర్వాత హార్మోన్లు సాధారణ స్థితికి రాగానే ఈ గీత దానంతట అదే మాయమవుతుంది’ అని సూచిస్తున్నారు.

News April 11, 2026

‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అంటే డీల్ కుదరదు: ఇరాన్

image

మరికాసేపట్లో డైరెక్ట్‌ టాక్స్ జరగనుండగా ముందుగానే ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో చర్చలు జరిపితే డీల్ కుదరొచ్చని.. ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనుకుంటే ఒప్పందం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం ఇస్తే యుద్ధం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంది. కాగా $100 బిలియన్ల ఆస్తుల రిలీజ్‌‌కు US ఒప్పుకుందన్న ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా అధికారులు ఖండించారు.