News March 13, 2026
IPL SPECIAL: 2 నెలలు పండగే!

ఈనెల 28 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈసారి రికార్డు స్థాయిలో 84 మ్యాచ్‌లు జరగనుండటంతో అభిమానులకు 2 నెలల పాటు వినోదం గ్యారంటీ. లీగ్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సీజన్ కానుంది. అలాగే ఆటను మరింత రంజుగా మార్చే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవి క్రికెట్ అభిమానులకు మరింత ఆసక్తికర మ్యాచ్‌లను అందించనున్నాయి.
Similar News
News March 28, 2026
Polyamory.. Tolyamory.. ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసా?

డేటింగ్ ప్రపంచంలో కొత్త పదాలు వినిపిస్తుంటాయి. పార్ట్‌నర్ పర్మిషన్‌తో అందరికీ తెలిసేలా ఒకే టైమ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో రిలేషన్ కొనసాగించడాన్ని ‘Polyamory’ అంటారు. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ముఖ్యం. మరోవైపు తన పార్ట్‌నర్‌కు బయట వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని ‘Tolyamory’ అంటారు. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ మౌన అంగీకారానికి ఈ కొత్త పేరు వచ్చి చేరిందంతే.
News March 28, 2026
మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.
News March 28, 2026
తాటి ముంజలు.. పోషకాల గనులు

వేసవిలో ఎక్కువగా లభించే తాటి ముంజల్లో విటమిన్ A, B, C, ఐరన్, జింక్, పొటాషియం లాంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘వీటిని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ, కాలేయ సమస్యలు తగ్గుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలోనూ సాయపడతాయి’ అని పేర్కొంటున్నారు. తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
#ShareIt


