News April 25, 2024

IPL: స్టొయినిస్ సెంచరీ

image

CSKతో జరుగుతోన్న మ్యాచ్‌లో LSG ప్లేయర్ మార్కస్ స్టొయినిస్ సెంచరీతో చెలరేగారు. 56 బంతుల్లో 5 సిక్సులు, 9 ఫోర్లు సాయంతో శతకం బాదారు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Similar News

News October 29, 2025

ఆ పోస్టులు ఖాళీగా లేవు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

image

బిహార్‌లో ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘బిహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో ప్రధాని సీటు ఖాళీగా లేవు. ఇక్కడ నితీశ్ ఉన్నారు. అక్కడ మోదీ ఉన్నారు. మీకు (ఆర్జేడీ, కాంగ్రెస్) ఛాన్స్ రాదు’ అని అన్నారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను రక్షించుకునేందుకే ఈ ఎన్నికలని చెప్పారు. ఒక్క పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రజలను హెచ్చరించారు.

News October 29, 2025

‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

image

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.

News October 29, 2025

కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

image

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.