News March 16, 2024

ఆటగాళ్ల పాస్‌పోర్ట్స్ తీసుకున్న ఐపీఎల్ జట్లు?

image

ఎలక్షన్స్ దృష్ట్యా ఐపీఎల్‌ రెండో దశ మ్యాచులను దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్టుల్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులుంటే ఈ చర్య ఉపకరిస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఈ 22న ఐపీఎల్ మొదలుకానుంది.

Similar News

News November 15, 2025

వంటింటి చిట్కాలు

image

* ఇన్‌స్టంట్‌ కాఫీపొడిని గాలి తగలని డబ్బాలో వేసి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డ కట్టదు.
* కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు కలిపి వేస్తే ఆమ్లెట్‌ మెత్తగా వస్తుంది.
* స్టీల్ గ్లాస్‌లు, గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయినపుడు పై గ్లాసును చల్లటి నీటితో నింపి, వేడినీటిలో ఉంచితే ఈజీగా వచ్చేస్తాయి.
* పాస్తా ముద్దలా అవ్వకూడదంటే ఉడికించేటపుడు చెక్క స్పూన్/ ఫోర్క్ వేస్తే సరిపోతుంది.

News November 15, 2025

ఈ ఆయుర్వేద ఉత్పత్తులతో లివర్‌కు ప్రమాదం: డా.ఫిలిప్స్

image

అధిక ఆర్సెనిక్, పాదరసం ఉన్న ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగంతో కాలేయానికి నష్టమని డాక్టర్ అబీ ఫిలిప్స్ రాసిన ఆర్టికల్‌ను మెక్‌గిల్ విశ్వవిద్యాలయం(కెనడా) ప్రచురించింది. ఈ లోహాల విషప్రభావం కాలేయాన్ని దెబ్బతీయడంతో పాటు ఆరోగ్య సమస్యలు తెస్తుందని ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తులపై నాణ్యత, నియంత్రణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News November 15, 2025

మోడల్ సిటీగా శ్రీసిటీ విస్తరణ: CBN

image

AP: మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6వేల ఎకరాలతో శ్రీసిటీని విస్తరిస్తామని CBN తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. CII సదస్సులో 5 యూనిట్లను వర్చువల్‌గా CM ప్రారంభించారు.