News April 12, 2024
IPL: పవర్‌ప్లేలో అత్యధిక స్కోరింగ్ రేటు ఆ జట్టుదే

IPL-2024లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరింగ్ రేటు కలిగిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (11.33) తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (10.70), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10.67), ఢిల్లీ క్యాపిటల్స్ (9.07), చెన్నై సూపర్ కింగ్స్ (8.77) ఉన్నాయి.
Similar News
News November 23, 2025
SRCL: డ్రగ్స్‌కు దూరంగా ఉందాం: డబ్ల్యూఓ లక్ష్మీరాజం

బాల్యవివాహాలను అరికట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల మెదడు మొద్దుబారడం, కండరాలు పనిచేయకుండా పోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు.
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.
News November 22, 2025
టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.


