News November 25, 2024

IPL: అప్పుడు రూ.18.50 కోట్లు.. ఇప్పుడు రూ.2.40 కోట్లు

image

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్‌ షాకింగ్ ధర పలికారు. రూ.2.40 కోట్లకే అతడిని CSK చేజిక్కించుకుంది. కాగా కరన్‌ను గతంలో పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌ను రూ.1.50 కోట్లు చెల్లించి KKR దక్కించుకుంది. డుప్లెసిస్‌ను రూ.2 కోట్లకు DC కైవసం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.20 కోట్లతో GT చేజిక్కించుకుంది.

Similar News

News December 27, 2025

బిందుసేద్యంతో నీటి వృథా తగ్గి, పంట దిగుబడి పెరుగుతుంది

image

బిందుసేద్యంతో సాగునీటివృథాను అరికట్టడమే కాకుండా నీటిని నేరుగా మొక్క వేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయవచ్చు. దీని వల్ల 30-50% నీటిని ఆదా చేయవచ్చు. అతి తేలికైన, ఇసుక, బరువైన నల్లరేగడి నేలలు, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూములు కూడా బిందు సేద్యానికి అనుకూలం. బిందు సేద్యంతో సరైన తేమ, సమపాళ్లలో పోషక పదార్థాలు అందడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయి.

News December 27, 2025

డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి?: బండి

image

TG: డ్రగ్స్ కేసు KTRకు చుట్టుకొని రాజకీయ జీవితం నాశనం అయ్యేలా ఉండడంతో నాటి CM KCR నీరుగార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘పట్టుబడిన సెలబ్రిటీలు, ఇతరులు KTR డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో SIT చీఫ్ అకున్ నివేదిక ఇచ్చారు. వాటిని నాటి CS సోమేశ్ తీసుకున్నారు. అవి ఏమయ్యాయి? సోమేశ్‌ను విచారించాలి. కేసును మళ్లీ అకున్‌కు అప్పగించాలి’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News December 27, 2025

కాంగ్రెస్ ఎంపీ పోస్ట్.. BJPకి బూస్ట్

image

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్వానీ పాదాల దగ్గర మోదీ కూర్చొన్న ఓ పాత ఫొటోను షేర్ చేస్తూ.. కింద కూర్చొనే సామాన్య కార్యకర్త కూడా CM, PM అయ్యే అవకాశం BJP, RSSలో ఉంటుందన్నారు. దీంతో ఇది పరోక్షంగా రాహుల్ గాంధీకి చురక అంటూ పలువురు సొంతపార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. వివాదం ముదరడంతో తాను వ్యవస్థను మెచ్చుకున్నానని BJPని కాదని దిగ్విజయ్ వివరణ ఇచ్చారు.