News May 26, 2024
IPL: ఫైనల్లో POTM అవార్డులు అందుకుంది వీరే!

ఇవాళ SRH, KKR మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఎవరు అందుకుంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటివరకు ఫైనల్లో యూసుఫ్ పఠాన్, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, మురళీ విజయ్, మన్వీందర్ బిస్లా, పొలార్డ్, మనీశ్ పాండే, రోహిత్ శర్మ, బెన్ కటింగ్, కృనాల్ పాండ్య, షేన్ వాట్సన్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, డుప్లెసిస్, హార్దిక్ పాండ్య, డెవాన్ కాన్వే అందుకున్నారు.
Similar News
News November 17, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్తో పాటు వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.
News November 17, 2025
2026 JANలో HYD-విజయవాడ NH విస్తరణ

TG: HYD-విజయవాడ NH65 విస్తరణ పనులు 2026 JANలో ప్రారంభం కానున్నాయి. 6 లేన్లుగా దీని విస్తరణకు DPR ఖరారైంది. పనులకు టెండర్లనూ పిలిచారు. ఈ నెలాఖరున ఇవి ఫైనల్ అవుతాయి. దాదాపు ₹10,000 CRతో 231 KMమేర విస్తరణ చేస్తారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ROBలు, అండర్పాస్లు కూడా హైవే విస్తరణ పనులలో భాగంగా ఉంటాయి. హైవే విస్తరణలో 33 ప్రధాన జంక్షన్లు, 105 చిన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.


