News November 15, 2024
IPL: సెట్-1 ప్లేయర్లు వీరే
ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభం కానుంది. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వేలానికి రానున్నారు. సెట్-2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వస్తారు. సెట్-3లో బ్రూక్, కాన్వే, మెక్‌గుర్క్, త్రిపాఠి, వార్నర్, పడిక్కల్, మార్క్రమ్ వస్తారు.
Similar News
News November 16, 2024
కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్
TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
News November 15, 2024
ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జిగా రవిబాబు
AP: ఒంగోలు నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జిగా చుండూరి రవిబాబును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం), బొడ్డేడ ప్రసాద్ (అనకాపల్లి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆముదాలవలస YCP సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.
News November 15, 2024
శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్
చివరి టీ20లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. శాంసన్(109*), తిలక్ వర్మ(120*) సెంచరీల మోత మోగించారు. జోహెన్నెస్‌బర్గ్‌లో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 283/1 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ, తిలక్ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మ్యాచ్‌లో మొత్తం 23 సిక్సర్లు బాదడం విశేషం. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 36 రన్స్‌తో రాణించారు.