News March 21, 2025
IPL: విజేతగా నిలిచేది వీరే.. మాజీల అంచనాలు

IPL 2025లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేశారు.
* సెహ్వాగ్-LSG,
* గిల్‌క్రిస్ట్- పంజాబ్,
* రోహన్ గవాస్కర్-ఆర్సీబీ,
* పొలాక్- ముంబై/SRH
* తివారీ- SRH
* సైమన్ డౌల్-పంజాబ్
* ఎంబంగ్వ- గుజరాత్
* హర్ష భోగ్లే, మైకేల్ వాన్, లిసా- MI
ఏ జట్టు గెలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 22, 2025
రోడ్డు దాటేటప్పుడు మొబైల్ వాడొద్దు: వరంగల్ పోలీస్

రోడ్లు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగంపై పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్‌పై కేవలం ఒక్క సెకను దృష్టి మళ్లినా ప్రమాదాలకు దారితీయవచ్చని అధికారులు సూచించారు. రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ను పూర్తిగా పక్కన పెట్టి జాగ్రత్తగా నడవాలని తమ అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా పౌరులకు విజ్ఞప్తి చేశారు.
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.
News November 22, 2025
పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.


