News March 24, 2025

IPL: ముంబైకి ఇదేం కొత్త కాదు

image

IPLలో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా CSKతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.

Similar News

News January 16, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

News January 16, 2026

గాదె ఇన్నయ్యకు 48 గంటల బెయిల్

image

TG: ఉపా కేసులో అరెస్టైన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్ లభించింది. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాంపల్లి NIA కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. HYDలోని చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. నిన్న రాత్రి ఇన్నయ్య తల్లి థెరిసమ్మ జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో కన్నుమూశారు. రేపు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

News January 16, 2026

ఈ సినిమాలన్నీ NETFLIXలోనే

image

షూటింగ్‌ దశలో ఉన్న పలు టాలీవుడ్ చిత్రాల డిజిటల్ రైట్స్ తామే సొంతం చేసుకున్నట్లు NETFLIX ట్వీట్ చేసింది. ఈ జాబితాలో రామ్ చరణ్ ‘పెద్ది’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, నాని ‘ప్యారడైజ్’, వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, శర్వానంద్ ‘బైకర్’, విజయ్ దేవరకొండ ‘VD 14’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఉన్నాయి. ఈ చిత్రాలు థియేటర్లలో విడుదలై 4-8 వారాల్లో OTTలోకి వచ్చే అవకాశముంది.