News March 16, 2024

IPL టికెట్ల అమ్మకం షురూ

image

హైదరాబాద్‌లో జరగబోయే IPL తొలి మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు <>పేటీఎం ఇన్‌సైడర్‌<<>>లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ల కనిష్ఠ ధర రూ.1500లుకాగా గరిష్ఠ ధర రూ.30 వేలుగా ఉంది. ఇక ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక ఫ్యాన్ జెర్సీ ఉచితంగా పొందవచ్చని SRH బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Similar News

News October 22, 2025

నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

image

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.

News October 22, 2025

వంటింటి చిట్కాలు

image

– బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
– బాగా పండిన టమాటాలను ఉప్పు నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికి తాజాగా ఉంటాయి.
– కాకరకాయ కూరలో సొంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
– ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను ఈజీగా తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడిగితే సరిపోతుంది.

News October 22, 2025

రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

image

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.