News March 14, 2025
నేటి నుంచి విశాఖలో IPL టికెట్లు

AP: విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న ఢిల్లీ-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచ్ టికెట్లు నేడు సా.4 గంటల నుంచి డిస్ట్రిక్ట్ యాప్‌లో విక్రయించనున్నారు. ఈ సీజన్లో విశాఖను తన సెకండ్ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్న ఢిల్లీ.. తమ తొలి మ్యాచ్ ఇక్కడే ఆడనుంది. ఈ నెల 30న ఢిల్లీ-SRH మ్యాచ్ టికెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Similar News
News April 2, 2026
ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.
News April 2, 2026
ఈ సాయంత్రం దీపాలు వెలిగిద్దాం: లోకేశ్

AP: అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రక విజయాన్ని వేడుకలా చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మన రాజధాని.. మన గౌరవం’ అని ట్వీట్ చేశారు.
News April 2, 2026
RECORD: ‘యశోద-కృష్ణ’ పెయింటింగ్‌కు ₹167కోట్లు

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద-కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలో జరిగిన వేలంలో ఈ చిత్రం ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడైంది. భారతీయ కళా చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రంగా ఇది నిలిచింది. గతంలో ఈ రికార్డు MF హుస్సేన్ గీసిన ‘అన్‌టైటిల్డ్’ పెయింటింగ్‌పై ఉండేది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ సైరస్ పూనావాలా ఈ అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు.


