News April 28, 2024
IPL: ఇవాళ డబుల్ ధమాకా

ఐపీఎల్ 2024లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య పోరు జరగనుంది. విజయంపై గుజరాత్ కన్నేయగా.. ఫామ్‌ను కొనసాగించాలని ఆర్సీబీ చూస్తోంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు CSK, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హోంగ్రౌండ్(చెపాక్)లో సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్కే ఎదురుచూస్తోంది.
Similar News
News January 18, 2026
రుక్మిణీ వసంత్ డేటింగ్?.. క్లారిటీ!

‘కాంతార-2’ భామ రుక్మిణీ వసంత్ ఫొటో SMలో వైరలవుతోంది. ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి సిద్ధాంత్ నాగ్ కాగా, అతనొక ఫొటోగ్రాఫర్ అని సమాచారం. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇది 2023లో దిగిన ఫొటో కాగా తాజాగా వైరలవ్వడం గమనార్హం. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్-నీల్, టాక్సిక్ మూవీల్లో నటిస్తున్నారు.
News January 18, 2026
భారీ జీతంతో కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 18, 2026
జగన్ రాజధాని కామెంట్లకు CM CBN కౌంటర్

AP: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ చేసిన కామెంట్లకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన బెంగళూరులో ఉంటే బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అదే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. 5ఏళ్లు ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. 3 రాజధానులు అని చెప్పిన ప్రాంతాల్లో కూడా NDA అభ్యర్థులు విజయం సాధించారని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని CBN పేర్కొన్నారు.


