News April 8, 2025

IPL: ఈరోజు రెండు మ్యాచ్‌లు

image

IPLలో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో KKR, LSG తలపడనుండగా రాత్రి 7.30 గంటలకు ముల్లాన్‌పూర్‌లో PBKS, CSK బరిలోకి దిగనున్నాయి. LSG, KKR రెండూ విజయాల బాటలోనే ఉండటంతో ఆ మ్యాచ్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో మ్యాచ్‌లో చెన్నై ఈరోజైనా గెలుస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. ఈ మ్యాచుల్లో ఎవరు గెలవచ్చు? కామెంట్స్‌లో చెప్పండి.

Similar News

News April 8, 2025

వేసవి సెలవుల్లోనూ ఇంటర్ క్లాసులు

image

TG: సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దన్న ఇంటర్ బోర్డు ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. బ్రిడ్జి కోర్సు పేరుతో ఫస్టియర్ విద్యార్థులకు, ఐఐటీ, నీట్ అంటూ సెకండియర్ విద్యార్థులకు సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా మార్చి 30తో పరీక్షలు ముగియగా, జూన్ 1 వరకూ ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇచ్చారు.

News April 8, 2025

SA స్టార్ ప్లేయర్ క్లాసెన్‌కు షాక్

image

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు క్లాసెన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(CSA) షాకిచ్చింది. బోర్డ్ విడుదల చేసిన 18మంది ఆటగాళ్ల 2025-26 కాంట్రాక్ట్‌ లిస్ట్‌‌‌లో క్లాసెన్ పేరు లేదు. ఇది ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ICC ఈవెంట్స్, కీలక సిరీస్‌ల్లో పాల్గొనేలా మిల్లర్, డసెన్‌కు హైబ్రిడ్ కాంట్రాక్ట్ కల్పించింది. కాగా SRH స్టార్ ప్లేయర్ క్లాసెన్‌పై IPL తర్వాత CSA తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

News April 8, 2025

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

image

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!