News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్‌టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
Similar News
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు(1/2)

AP: ఖరీఫ్ సీజన్ పత్తి సేకరణకు ప్రభుత్వం 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తారు. ☛ విజయనగరం జిల్లాలోని రాజాం
☛ మన్యం జిల్లాలో సాలూరు, పాలకొండ(భామిని)
☛ కాకినాడ జిల్లాలో పిఠాపురం ☛ ఏలూరు జిల్లాలో చింతలపూడి (జంగారెడ్డిగూడెం)
☛ NTR జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు (గంపలగూడెం, ఏ కొండూరు), కంచికచర్ల
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు (2/2)

☛ గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు ☛ పల్నాడు జిల్లాలో మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల (నడికుడి), క్రోసూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట ☛ బాపట్లలో పర్చూరు (పర్చూరు, మార్టూరు)
☛ ప్రకాశంలో మార్కాపురం ☛ కడపలో ప్రొద్దుటూరు
☛ అనంతపురంలో గుత్తి, తాడిపత్రి,
☛ నంద్యాలలో నంద్యాల ☛ కర్నూలులో ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు(పెంచికలపాడు), మంత్రాలయంలో పత్తిని కొనుగోలు చేస్తారు.
News October 15, 2025
రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్‌రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.