News October 17, 2024
IPL: రోహిత్ శర్మ ఏ టీమ్ అంటే?

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31లోగా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ముంబై రోహిత్, హార్దిక్, బుమ్రా, సూర్యలను రిటైన్ చేసుకోవచ్చని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది. ఇదే జరిగితే రోహిత్ శర్మకు ముంబై కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తుందో లేదా పాండ్యను కొనసాగిస్తుందో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News October 30, 2025
నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్‌గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
News October 30, 2025
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.


