News February 17, 2025
IPL: అత్యధిక ఓపెనింగ్ మ్యాచులు ఆడింది ఆ జట్టే

IPLలో అత్యధిక ఓపెనింగ్ మ్యాచులు ఆడిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 9 సార్లు టోర్నీ ఓపెనింగ్ మ్యాచుల్లో బరిలోకి దిగింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ (8) నిలిచింది. మూడు నాలుగు స్థానాల్లో కేకేఆర్ (7), ఆర్సీబీ (5) ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచులు ఆడకపోవడం గమనార్హం.
Similar News
News December 26, 2025
మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.
News December 26, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
భారత్ ఘన విజయం

శ్రీలంక ఉమెన్స్తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.


