News November 26, 2024
IPL: ఏ టీమ్ బలంగా ఉంది?
2025 మార్చి 14న మొదలయ్యే IPLకు రంగం సిద్ధమైంది. నిన్న, మొన్నటి వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఇక ట్రోఫీ కోసం ఆటగాళ్లు తలపడటమే మిగిలింది. ఈ వేలం తర్వాత కొన్ని జట్లు బలంగా మారితే.. మరికొన్ని జట్లు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేదు. అయితే MI, DC, SRH, CSK తెలివిగా ఆటగాళ్లను కొన్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇంతకీ ఏ జట్టు బలంగా ఉందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News November 26, 2024
ARJUN TENDULKAR: 9.30 గంటలకు అన్‌సోల్డ్.. 10.30 గంటలకు సోల్డ్
ఐపీఎల్ వేలంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలుత అన్‌సోల్డ్‌గా మిగిలారు. గంట వ్యవధిలోనే మళ్లీ ఆయన పేరు వేలంలో ప్రత్యక్షమైంది. వెంటనే ముంబై ఇండియన్స్ ఆయనను బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ బిడ్ వెనుక ఏదో జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుందో కామెంట్ చేయండి.
News November 26, 2024
ఒకే రోజున అక్కినేని హీరోల పెళ్లి?
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ జైనాబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండగా, అఖిల్‌ది కూడా అదేరోజున అదే వేదికపై జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల వివాహాలు ఒకేరోజున, ఒకే వేదికపై జరిగితే ఫ్యాన్స్‌కు కనుల పండుగే.
News November 26, 2024
నష్టాల బాటలో అదానీ గ్రూప్ సంస్థలు
Adani Group Stocks మంగళవారం నష్టాల్లో పయనించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 7% నష్టపోయింది. ఎనర్జీ సొల్యూషన్స్ 5%, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, పవర్, విల్మర్ 3-4% నష్టపోయాయి. Ports, అంబుజా 2%, ACC, NDTV 1% చొప్పునా నష్టపోయాయి. లంచాల ఆరోపణలతో రేటింగ్ ఏజెన్సీ Fitch పలు అదానీ సంస్థల బాండ్స్‌ను పొటెన్షియల్ డౌన్‌గ్రేడ్ లిస్ట్‌లో ఉంచడం నష్టాలకు దారితీసినట్టు తెలుస్తోంది.