News February 17, 2025

IPL.. ఈ జట్లకు కెప్టెన్లు ఎవరు?

image

IPL-2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇటీవలి వేలంలో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఆయా ఫ్రాంచైజీలను వీడారు. RCB తమ కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించలేదు. KKRలో రహానే, వెంకటేశ్ అయ్యర్, నరైన్, రింకూ.. DCలో KL రాహుల్, అక్షర్ పటేల్, డుప్లిసెస్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో కామెంట్ చేయండి.

Similar News

News October 14, 2025

1,743 పోస్టులు.. ఎగ్జామ్ డేట్ ఇదే

image

TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. ఉ.10 నుంచి మ. ఒంటిగంట వరకు మల్టిపుల్ ఛాయిస్, మ.2.30 నుంచి సా.5.30 గంటల వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1,743 పోస్టులకు 3,132 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 14, 2025

అత్యధిక మంది చూసిన సినిమాగా ‘వార్-2’

image

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్-2 థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

News October 14, 2025

50% పరిమితి రాజ్యాంగంలో లేదు: ప్రభుత్వం

image

TG: SCలో దాఖలు చేసిన <<17999644>>పిటిషన్‌<<>>లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది.
* రిజర్వేషన్లపై 50% పరిమితి ఉన్నట్లు రాజ్యాంగంలో లేదు. * ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని గతంలో SC చెప్పింది. * సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలున్నారు. * శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను 3నెలల్లో గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఓకే చేసినట్లే.