News February 13, 2025

IPL: ఆ ఇద్దరు ఎవరో?

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, KKR జట్లకు కెప్టెన్లు ఖరారు కావాల్సి ఉంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, రాహుల్ తదితర ప్లేయర్ల పేర్లు పరిశీలనలో ఉండగా కోల్‌కతాకు రసెల్, రహానే, నరైన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి మేనేజ్మెంట్స్ ఎవరివైపు మొగ్గుతాయో త్వరలో తేలనుంది.
ఇతర జట్ల కెప్టెన్లు:
CSK-రుతురాజ్, గుజరాత్-గిల్, లక్నో-పంత్, పంజాబ్-శ్రేయస్, రాజస్థాన్-శాంసన్, MI-హార్దిక్, ఆర్సీబీ-రజత్ పాటిదార్, SRH-కమిన్స్.

Similar News

News February 13, 2025

రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు

image

అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్‌లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.

News February 13, 2025

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

image

AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

News February 13, 2025

రాష్ట్రపతి పాలనతో సంభవించే మార్పులివే

image

✒ రాష్ట్ర ప్రభుత్వం/మంత్రి మండలి రద్దవుతుంది.
✒ ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు.
✒ ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటారు.
✒ పాలనలో గవర్నర్‌కు సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
✒ రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ రూపొందిస్తుంది. ✒ అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేస్తారు.

error: Content is protected !!