News May 20, 2024

IPL: ఎవరు ఎలిమినేట్ అవుతారు?

image

RCB, RR ఎలిమినేటర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇరుజట్లు ఎలిమినేటర్లో తలపడటం ఇది రెండోసారి. 2015లో తొలిసారి ఈ జట్ల మధ్య నాకౌట్ పోరు జరగ్గా RCB విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో RR 109 రన్స్‌కే కుప్పకూలడంతో RCB 71 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఇక ఈ సీజన్‌లో RR మే గండం ఎదుర్కొంటోంది. ఈ నెలలో ఆ టీమ్‌కి అన్నీ పరాజయాలే. మరోవైపు మే నెలలో RCBకి ఓటమన్నదే లేదు. ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

News November 17, 2025

వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

image

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

News November 17, 2025

హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.