News March 22, 2025

IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

image

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.

Similar News

News December 3, 2025

శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

image

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్‌లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

News December 3, 2025

హనుమాన్ చాలీసా భావం – 28

image

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 3, 2025

IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

image

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్‌వెల్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్‌రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.