News March 22, 2024
IPL: ఇవాళ గెలిచేది ఎవరు?

IPL-2024లో భాగంగా ఇవాళ చెపాక్ మైదానంలో CSK, RCB మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచులు గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్ మ్యాచులన్నీ జియో సినిమా యాప్(ఫ్రీ), స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో ప్రసారం కానున్నాయి. ఇవాళ్టి మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
పింఛన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలి:JC

డిసెంబర్ 1న పింఛన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట శుక్రవారం అధికారులకు సూచించారు. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి పింఛన్ పంపిణీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలన్నారు. ఒకటో తేదీన నూరు శాతం పింఛన్ నగదు పంపిణీకి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలన్నారు.
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.


