News March 22, 2025
IPL: ఇవాళ మ్యాచ్ జరుగుతుందా? లేదా?

ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ రాత్రి జరిగే IPL ఓపెనింగ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని కోల్‌కతా ఆక్యూవెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పటికే మబ్బులు తొలగి సూర్యుడు దర్శనమిస్తున్నాడు. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టినా పొడి వాతావరణమే ఉంటుంది. మ్యాచ్ జరిగినంతసేపూ.. అంటే రాత్రి 12 గంటల వరకూ వాన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వర్షం పడితే కనీసం 5 ఓవర్ల ఆట అయినా ఆడించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
Similar News
News March 23, 2025
బ్లాక్‌లో SRH Vs RR మ్యాచ్ టికెట్లు.. 11మంది అరెస్ట్

ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరంలో నలుగురు, మల్కాజిగిరిలో ముగ్గురు, ఎల్బీనగర్‌లో ముగ్గురు, భువనగిరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
News March 23, 2025
బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ బెట్టింగ్ యాప్‌కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
News March 23, 2025
LSGలోకి స్టార్ ఆల్‌రౌండర్ ఎంట్రీ

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గాయం కారణంగా IPL నుంచి తప్పుకున్న మొహ్సిన్ ఖాన్ స్థానంలో అతడిని తీసుకుంది. త్వరలో ఆయన జట్టుతో చేరనున్నారు. కాగా గతంలో శార్దూల్ ఠాకూర్ CSK, PBKS, KKR, DC, RPS జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 95 మ్యాచులాడి 94 వికెట్లు, 307 పరుగులు చేశారు.