News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
Similar News
News November 21, 2025
నాగార్జునసాగర్-శ్రీశైలం వెళ్తున్నారా?.. మీ కోసమే

నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ శనివారం సాగర్ జలాశయం నుంచి కృష్ణా నదిలో నల్లమల అటవీ అందాల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణం పెద్దలకు రూ.2 వేలు, 5 – 10 పిల్లలకు రూ.1600లుగా ధర నిర్ణయించారు.
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.


