News March 23, 2025

IPL: మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేనా?

image

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH, RR మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా మరికాసేపట్లో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు నగరంపై ఇప్పటికే మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK, MI మ్యాచుకూ వరుణుడి ముప్పు ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

బంగారం ధరలు మరింత పైకి: WGC

image

వచ్చే ఏడాది కూడా పసిడి జోరు కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయుల నుంచి 15-30% పెరగవచ్చని చెప్పింది. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యాంకులు బంగారాన్ని కొంటుండటం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ రేట్లు 53% పెరిగాయి. అయితే US దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తే ధరలు 5-20% దిగి రావచ్చని WGC పేర్కొంది.

News December 5, 2025

యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

image

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్‌లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.