News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

Similar News

News March 23, 2025

రాజమండ్రి: మంత్రి దుర్గేశ్ గెటప్ ఫొటో వైరల్

image

ఇటీవల అమరావతిలో జరిగిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ బాలచంద్రుని వేషధారణలో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేశ్, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో MA చదువుకున్నపటి రోజుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో బాలచంద్రుని గెటప్‌లో ఉన్న మంత్రి ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.

News March 23, 2025

తూ.గో: క్యాన్సర్ కేసుల నమోదులో భయాందోళనలు వద్దు

image

తూ.గో జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళనలు వద్దని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఆమె బలభద్రపురంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకు గాను 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, అనపర్తి నియోజక వర్గం బలభద్రపురంలో 23 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.

News March 22, 2025

RJY: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు

image

సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, అసభ్యకరమైన, అనైతిక, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఏ విధమైన పోస్ట్లు పెట్టొద్దని ఎస్పీ హితవు పలికారు.

error: Content is protected !!