News November 27, 2024
IPL: అప్పుడు ₹.కోట్లు, ఇప్పుడు..
గత IPL వేలంలో కళ్లుచెదిరే ధర పలికిన క్రికెటర్లు ఈసారి అమ్ముడుపోలేదు. మరికొందరికి తక్కువ ధర వచ్చింది.
*మిచెల్‌కు 2024 మినీ వేలంలో రూ.14 కోట్లు, అల్జరీ జోసెఫ్‌కు రూ.11.50 కోట్లు, రూసోకు రూ.8 కోట్లు, పృథ్వీ షాకు రూ.7.50 కోట్లు రాగా ఈసారి అమ్ముడుపోలేదు. సమీర్ రిజ్వీ రూ.8.40 కోట్ల నుంచి రూ.95 లక్షలకు, కరన్ రూ.18.5 కోట్ల నుంచి రూ.2.40 కోట్లకు, స్టార్క్ రూ.24.75 కోట్ల నుంచి రూ.11.75 కోట్లకు పడిపోయారు.
Similar News
News December 26, 2024
70 గంటలుగా బోరుబావిలో.. చిట్టి తల్లికి నరకం
రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో 3ఏళ్ల చిన్నారి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 70 గంటల క్రితం ఆమె పడిపోగా అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలిక ప్రస్తుతం 150 అడుగుల వద్ద ఉందన్నారు. పైపుతో ఆక్సిజన్ పంపిస్తున్నామని తెలిపారు. చిట్టితల్లి క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
News December 26, 2024
ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్
TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రూ.5వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
News December 26, 2024
ఇండియాలో లక్షలో 96 మందికి క్యాన్సర్
మారిన జీవనశైలితో వేలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెన్మార్క్ దేశంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. లక్ష మందిలో 335 మందికి క్యాన్సర్ సోకుతోంది. దీని తర్వాత ఐర్లాండ్(326), బెల్జియం(322), హంగేరీ(321), ఫ్రాన్స్(320), నెదర్లాండ్స్(315), ఆస్ట్రేలియా(312), నార్వే(312), స్లోవేనియా(300), అమెరికా(297) ఉన్నాయి. ఇక లక్షలో 96 మంది క్యాన్సర్ బాధితులతో ఇండియా 163వ స్థానంలో ఉంది. SHARE IT