News April 10, 2025
IPL2025: వ్యూవర్షిప్‌లో RCB మ్యాచులు టాప్

ఈ ఏడాది IPL మ్యాచులు అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. 3 దిగ్గజ జట్లు CSK, MI, SRHలు పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుకు చేరాయి. అయితే, వ్యూవర్షిప్‌లో మాత్రం RCB ఆడిన ప్రతి మ్యాచుకు JioHotstarలో అత్యధిక వ్యూస్ వచ్చాయి. RCBvsKKR మ్యాచ్‌కు 41.7 కోట్లు, RCBvsCSKకు 37.4 కోట్లు, RCBvsMIకు 34.7కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. RCB 4 మ్యాచుల్లో 3 గెలిచి టాప్-3లో కొనసాగుతోంది.
Similar News
News March 12, 2026
కోడిగుడ్డు ధరలు తగ్గాయ్..

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఎగుమతులు భారీగా తగ్గిపోయి నిల్వలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని వారాల క్రితం ఒక్కో గుడ్డు రూ.7-8 ఉండగా ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో రూ.3.5-4కే అమ్ముతున్నారు. రిటైల్‌లో మాత్రం రూ.6 వరకు తీసుకుంటున్నారు. మరి మీ దగ్గర గుడ్డు రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News March 12, 2026
ఇరాన్ యుద్ధం.. భారత్‌కు బిగ్ రిలీఫ్

క్రూడాయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు NDTV తెలిపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. దీంతో పుష్పక్, పరిమల్ అనే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల ఆయిల్‌ను మనం సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అటు US, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.
News March 12, 2026
సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.


