News December 6, 2024
IPOకు LG Electronics India

మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఐపీవోకు రానుంది. LG Electronics India రూ.15,237 కోట్లు సమీకరించేందుకు ఐపీవో పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్టు సమాచారం. సంస్థ వాటాదారుల షేర్ల విక్రయానికి Offer for Sale రూపంలో ఐపీవోకు రానుంది. 10.18 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ ఆఫర్ చేయనుంది.
Similar News
News April 17, 2026
రోజూ తలస్నానం చేయొచ్చా?

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.
News April 17, 2026
APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్-Cకు 35, సైంటిస్ట్-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.
News April 17, 2026
హైదరాబాద్‌లో మరో సైబర్ టవర్!

TG: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్‌ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.


