News December 23, 2024

IPO బూమ్: 90 సంస్థలు.. రూ.1.60 లక్షల కోట్లు

image

ఈ ఏడాది కంపెనీల ఐపీవోలకు అసాధారణ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 90 సంస్థలు ఐపీవోల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ అత్యధికంగా రూ.27,870 కోట్లు, స్విగ్గీ రూ.11,327 కోట్లు, ఎన్టీపీసీ రూ.10వేల కోట్లను సమీకరించాయి. వచ్చే ఏడాది 75 సంస్థలు రూ.2.50 లక్షల కోట్ల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి.

Similar News

News November 28, 2025

బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం..!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

News November 28, 2025

KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

image

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.

News November 28, 2025

రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్

image

అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, KNRకు చెందిన శిఖాపాండే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఏకంగా రూ. 2.4కోట్లు దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేలంలో 36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను బేస్ ధర రూ.40 లక్షలు కాగా, UP వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. రామగుండం NTPC ఉద్యోగి కుమార్తె అయిన శిఖాపాండే రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా, కోట్లు పలకడం మహిళల క్రికెట్ ఆదరణకు నిదర్శనం.