News July 31, 2024
IPSకు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్

ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో 198వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో గ్రూప్-1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఐపీఎస్‌కు ఎంపికవగా ఆగస్టు 26 నుంచి ముస్సోరిలో జరగనున్న ఐపీఎస్ శిక్షణకు హాజరుకానున్నారు.
Similar News
News February 27, 2026
భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.
News February 27, 2026
కలెక్టరుకు చాక్‌పీస్ మైక్రోఆర్ట్ బహూకరణ

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
News February 27, 2026
ఉండి: RRR ను పరామర్శించిన సినీనటుడు మోహన్‌బాబు

క్రీడా పోటీల్లో గాయపడి, ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోహన్ బాబు, రఘురామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


