News July 31, 2024

IPSకు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్

image

ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో 198వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో గ్రూప్-1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఐపీఎస్‌కు ఎంపికవగా ఆగస్టు 26 నుంచి ముస్సోరిలో జరగనున్న ఐపీఎస్ శిక్షణకు హాజరుకానున్నారు.

Similar News

News October 14, 2024

నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

image

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.

News October 14, 2024

బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్‌లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

News October 13, 2024

ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ

image

ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.