News August 19, 2025
IPSC డాన్స్ ఫెస్ట్-2025లో మెరిసిన యషితా బాంటియా

జోధ్‌పూర్‌లోని రాజమాత కృష్ణ కుమారి బాలికల పబ్లిక్ స్కూల్ నిర్వహించిన ఇపస్సీ డ్యాన్స్ ఫెస్ట్-2025 నిర్వహించారు. బేగంపేటలోని HYD పబ్లిక్ స్కూల్‌కు చెందిన యషితా బాంటియా సత్తాచాటింది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదని ఆమె అన్నారు. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. బాంటియా ఫర్నిచర్ యజమాని సురేందర్ బాంటియా మనవరాలే ఈ యషితా.
Similar News
News September 13, 2025
సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
HYD: గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్.. విధుల్లో కొనసాగింపు

గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో దాదాపు 970 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.