News September 24, 2025
కశ్మీర్ లోయలో ఫ్యాషన్ చుక్క ఇక్రా అహ్మద్

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుతున్నారు కశ్మీర్‌కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.
Similar News
News September 24, 2025
మెడికల్ సీట్ల పెంపునకు కేంద్రం ఆమోదం

దేశంలో వైద్య విద్య విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. UG, PG మెడికల్ సీట్ల పెంపునకు అంగీకరించింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్-3 కింద 5వేల కొత్త PG, 5,023 MBBS సీట్లకు ఆమోదం తెలిపింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా Govt వైద్య కళాశాలలు, ఆస్పత్రుల రెనోవేషన్‌కు సాయం, స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమంకానుంది.
News September 24, 2025
ఆఫర్‌లోనూ ధరలు తగ్గలేదని చర్చ!

ఈ కామర్స్ సైట్లు దసరా సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించగా, తొలిరోజు ఉన్న ధరలు ఇప్పుడు లేకపోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ యూజర్ iphone 15plus ఫోన్‌ను బుక్ చేసేందుకు ట్రై చేయగా 23% ఆఫ్‌తో రూ.68,999గా చూపించిందని పేర్కొన్నారు. గతనెలలో ఇదే ఫోన్ రూ.69,499 ఉందని, ఆఫర్ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మీకూ ఇలా జరిగిందా?
News September 24, 2025
అనార్కలీకి ఈ ఫుట్‌వేర్ బెస్ట్

ఎత్నిక్ వేర్‌లో అనార్కలీకి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆఫీస్ వర్క్‌వేర్‌గా, ఫంక్షనల్ వేర్‌గా ఎలా ధరించినా ఎంతో అందంగా ఉంటారు అమ్మాయిలు. అయితే ఏ సందర్భానికైనా అనార్కలీని సరిగ్గా స్టైల్ చేయడానికి కొన్ని ఫుట్‌వేర్‌లు బెస్ట్ అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. ముఖ్యంగా జుట్టీస్, కొల్హాపురి, ఎంబ్రాయిడరీ ఫ్లాట్స్, బ్లాక్ హీల్స్ వంటివి అనార్కలీ స్టైలింగ్‌లో వాడితే ఎంతో ఎలిగెంట్‌గా ఉంటాయంటున్నారు.