News October 2, 2024

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రులే!

image

ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఈ రెండూ కలిసి మరో దేశంపై యుద్ధం కూడా చేశాయి. ఇరాక్‌పై దాదాపు దశాబ్దంపాటు కలిసి పోరాటం చేశాయి. 1958 నుంచి 1990 వరకు ఈ రెండు దేశాలు కవలలుగా కొనసాగాయి. అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్‌కు రహస్యంగా యుద్ధ విమానాల టైర్లను ఇజ్రాయెల్ సరఫరా చేసింది. కానీ 1990 తర్వాత ఇరాక్ ముప్పు తొలగటం, అరబ్ సోషలిజం రావడం, హెజ్బొల్లా, హమాస్‌తో గొడవల వల్ల బద్ధ శత్రువులుగా మారాయి.

Similar News

News October 2, 2024

రాహుల్, ప్రియాంక.. మీ మంత్రుల మాటలు వినండి: BRS

image

KTRపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని BRS స్పందించింది. ‘రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్‌లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

News October 2, 2024

మేం పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదు: మంత్రి సీతక్క

image

TG: తామేమీ పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు. తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు. KTR తమను శిఖండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. తమ నోళ్లను పినాయిల్‌తో కడగాలన్న KTR నోటినే యాసిడ్‌తో కడగాలని ధ్వజమెత్తారు.

News October 2, 2024

ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్!

image

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.