News October 29, 2024
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ అణుబాంబుల తయారీ: నెతన్యాహూ

తమను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేయనుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తాజాగా ఆరోపించారు. వాటిలో దీర్ఘ పరిధి క్షిపణులు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి చేరుకుంటోంది. ఆ దేశ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మా ప్రథమ లక్ష్యం. మా చర్యల గురించి ఇప్పుడే వెల్లడించలేను’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 3, 2025
విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.
News December 3, 2025
పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.


