News March 31, 2025
ప్రతిదాడి తప్పదు.. USకు ఇరాన్ వార్నింగ్

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే <<15942110>>దాడులు చేస్తామన్న<<>> US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా అన్నంత పనిచేస్తే తాము ఎదురుదాడులు చేస్తామని సుప్రీం లీడర్ అయతుల్లా తేల్చిచెప్పారు. కాగా ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా ఉంచినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడులకు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంటున్నాయి.
Similar News
News April 2, 2025
పంజాబ్ కింగ్స్: దేశీయ ఆటగాళ్లే బలం

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ఇందులో శ్రేయస్ ఒక్కడే జాతీయ జట్టు తరఫున ఆడారు. మిగతా అందరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఇక బ్యాటర్లలో స్టొయినిస్, మ్యాక్సీ మాత్రమే ఫారిన్ ప్లేయర్లు.
News April 2, 2025
వక్ఫ్ చట్ట సవరణతో వచ్చే మార్పులివే..

సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయం. దేశంలో మొత్తం 30 బోర్డులున్నాయి. వీటి పరిధిలో 9.4L ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇవే అత్యధికం.
News April 2, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.