News June 7, 2024

ఇరానీ TO రాజీవ్.. ఓడిన 13మంది కేంద్రమంత్రులు వీరే..

image

2024లో NDA కూటమికి చెందిన మంత్రుల్లో 13మంది ఓడిపోయారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ, ఎలక్ట్రానిక్స్&ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా వంటి ప్రముఖులతో పాటు రావ్ సాహెబ్ దాన్వే, నాథ్ పాండే, సుభాష్ సర్కార్, కైలాశ్ చౌదరి, నిషిత్ ప్రమాణిక్, L మురుగన్, సంజీవ్ బల్యాన్, కపిల్ పాటిల్, భారతీ పవార్ వంటి మంత్రులు ఓడిపోయారు.

Similar News

News January 11, 2025

ఆమెపై పరువునష్టం దావా: గరికపాటి టీమ్

image

ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన మహిళను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఆయన టీమ్ తెలిపింది. సరస్వతుల కామేశ్వరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు SMలో ప్రకటించింది. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకూ లీగల్ నోటీసులు పంపించినట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని గరికపాటి టీం పేర్కొంది.

News January 11, 2025

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

News January 11, 2025

ఈవీలకు పన్ను రాయితీ

image

AP: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0(2024-2029)ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇది ఉన్నంతకాలం ఈవీలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. హైబ్రిడ్ 4 వీలర్స్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.