News November 22, 2024

విమానాల పైనుంచి దూసుకెళ్లిన ఇరాన్ మిస్సైల్స్?

image

గత నెలలో ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన 200 ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ పౌర విమానాల పైనుంచి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానాల్లో ప్రయాణిస్తున్న కొందరు పైలట్లు, ప్రయాణికులు నిప్పులు చిమ్ముతూ వెళ్తున్న మిస్సైళ్లను చూసినట్లు సమాచారం. ఈ మిస్సైళ్లతో పదుల సంఖ్యలో విమానాలకు పెనుముప్పు తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Similar News

News December 29, 2025

ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

image

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.

News December 29, 2025

హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

image

<>HYD <<>>సనత్‌నగర్‌లోని ESIC హాస్పిటల్‌ 102 ఫ్యాకల్టీ, Sr. రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి JAN 7వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టును బట్టి MBBS, MCh, DM, DNB, MD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2.56లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.70లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.46లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 29, 2025

చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

image

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||