News May 23, 2024

ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు పూర్తి

image

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సొంత పట్టణం మషాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను చివరి చూపులు చూసేందుకు నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 63 ఏళ్ల రైసీ నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇరాన్ వెళ్లి రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Similar News

News January 16, 2025

కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

News January 16, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

News January 16, 2025

‘ముక్కనుమ’ గురించి తెలుసా?

image

సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు