News July 17, 2024
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించింది. ఇటీవల జరిగిన దాడికి ముందే ఈ నివేదికను ఇచ్చింది. దీంతో ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్‌కు ఇరాన్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ట్రంప్‌పై కాల్పుల వెనుక ఉక్రెయిన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 21, 2025
GNT: మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి

ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి నేడు. ఆయన 1902లో కారంపూడిలో జన్మించారు. 1952 నవంబర్ 21న పరమపదించారు. సుబ్బారావు నాటక రంగంలో శ్రీకృష్ణుడి పాత్రకు జీవం పోశారు. పాండవోద్యోగ విజయాలు నాటకంలో ఆయన కృష్ణ పాత్రధారణ తారాస్థాయిని అందుకుంది. కృష్ణ వేషధారణలో మీసాలు ధరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన్ను మీసాల కృష్ణుడు అని పిలిచేవారు. శ్రీకృష్ణ పాత్రకు అంకితమైన నటుడిగా పేరు పొందారు.
News November 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News November 21, 2025
హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.


