News October 13, 2025

పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.

Similar News

News October 13, 2025

నల్లదారం కట్టుకోవడం వెనుక ఆంతర్యం

image

హిందూ సంస్కృతిలో నలుపు రంగును ప్రతికూల శక్తులను శోషించుకునే శక్తిగా భావిస్తారు. దీన్ని నర దిష్టి, చెడు దృష్టి నుంచి రక్షణగా ధరిస్తారు. అందుకే చిన్న పిల్లలకు, పెళ్లి కొడుకు/కూతర్లకు దిష్టి చుక్క పెడతారు. అలాగే నల్ల దారం కూడా దైవిక కవచంలా పనిచేస్తుందని పండితుల వాక్కు. మనపై దుష్ట శక్తులు ప్రభావం పడకుండా ఇది అడ్డుకుంటుందని నమ్మకం. రోగాలు, అరిష్టాలు పోయి సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు.

News October 13, 2025

జెఫ్ బెజోస్ మాజీ భార్య రూ.372 కోట్ల విరాళం

image

అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మరోసారి భారీ విరాళంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శాన్ రాఫెల్‌కు చెందిన ‘10,000 డిగ్రీస్’ అనే సంస్థకు $42 మిలియన్లు(దాదాపు రూ.372 కోట్లు) విరాళం అందించారు. ‘నేటివ్ ఫార్వర్డ్’ అనే సంస్థకు గతంలో $10 మిలియన్ల విరాళమిచ్చారు. ఆమె ఇచ్చిన డబ్బును ఈ సంస్థలు వాటి అవసరాలకు తగ్గట్లు వాడుకోవచ్చు. ఈ పనికే వాడాలి అనే ఆంక్షలు విధించరు.

News October 13, 2025

1.7M బాట్ అకౌంట్స్ డిలీట్ చేసిన ‘X’

image

తాము ఈ వారంలో 1.7 మిలియన్ల బాట్ అకౌంట్స్ డిలీట్ చేసినట్లు ‘X'(ట్విట్టర్) పేర్కొంది. ఎలాన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసినప్పుడే ‘X’ నుంచి బాట్ అకౌంట్స్‌ను పూర్తిగా తొలగిస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. ‘రిప్లై స్పామ్‌లో భాగమైన 17 లక్షల బాట్ అకౌంట్స్ డిలీట్ చేశాం. రాబోయే రోజుల్లో మీరు మార్పు గమనిస్తారు. DM స్పామ్ మీద ఫోకస్ చేయబోతున్నాం.’ అని ఆ సంస్థ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ పేర్కొన్నారు.