News May 21, 2024
జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు

ఇరాన్లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడి ఎన్నికకు ప్రభుత్వం నిర్ణయించిందని స్థానిక మీడియా తెలిపింది. కాగా ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు దేశంలోని ముగ్గురు అగ్రశ్రేణి అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?