News September 28, 2024
రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మృతితో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. నస్రుల్లా మృతిపై ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్తో ఖమేనీ సమావేశమైనట్టు The New York Times తెలిపింది. అలాగే తదుపరి క్యాచరణపై హెజ్బొల్లా, ప్రాంతీయ గ్రూప్లతో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.
Similar News
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.


