News December 4, 2024
IRCTC: ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఫ్రీ

తాము ప్రయాణించాల్సిన ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులకు IRCTC ఉచిత భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉంది. టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు. ట్రైన్ ఎక్కకముందే 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు.
Similar News
News November 8, 2025
వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 8, 2025
తాజా సినీ ముచ్చట్లు!

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.
News November 8, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://ddpdoo.gov.in/


