News January 31, 2025

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుపై IRDAI గుడ్‌న్యూస్

image

ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియాన్ని 10% కన్నా ఎక్కువ పెంచొద్దని స్పష్టం చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకవేళ 10% కన్నా ఎక్కువ పెంచాలని భావించినా, ఈ స్కీములను రద్దు చేయాలనుకున్నా తమను కచ్చితంగా సంప్రదించాలని ఆదేశించింది. పరిమిత ఆదాయమే ఉండే వృద్ధులపై ఆర్థికభారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది.

Similar News

News December 8, 2025

తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు.

News December 8, 2025

వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

image

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.

News December 8, 2025

గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

image

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.