News June 16, 2024
ఐర్లాండ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమైంది. డెలానీ(31), లిటిల్(22) ఫరవాలేదనిపించారు. మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్ బౌలర్లలో అఫ్రిది 3, ఇమాద్ 3, అమిర్ 2, రవూఫ్ 1 వికెట్ చొప్పున తీశారు. పాక్ గెలవాలంటే 107 రన్స్ చేయాలి. ఈ రెండు జట్లు ఇప్పటికే సూపర్8 రేసు నుంచి నిష్క్రమించాయి.
Similar News
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <


