News April 14, 2025
2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <
News April 15, 2025
పంజాబ్‌కు ‘మ్యాక్సీ’మమ్ నిరాశే

పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచారు. KKRతో మ్యాచులో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ముందుండి నడిపించాల్సింది పోయి వరుణ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు. గత మ్యాచుల్లోనూ మ్యాక్సీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మొత్తంగా ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 41 పరుగులే చేశారు. దీంతో జట్టుకు భారంగా మారారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
News April 15, 2025
లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.