News April 15, 2025
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. టీజీపీఎస్సీ క్లారిటీ

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.
Similar News
News January 26, 2026
హిందీ అనేక మాతృభాషలను మింగేసింది: ఉదయనిధి

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదని Dy.CM ఉదయనిధి స్పష్టం చేశారు. 1960sలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాదిలో హిందీని ప్రవేశపెట్టడం వల్ల హర్యాన్వీ, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
News January 26, 2026
రంజీ ట్రోఫీ.. 568 రన్స్ తేడాతో బిహార్ ఘన విజయం

రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో మణిపుర్‌పై బిహార్ 568 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. బిహార్ ఆటగాళ్లు పీయూష్ సింగ్ 216*, బిపిన్ 143, సకిబుల్ గని 108 పరుగులతో చెలరేగారు. కాగా ఈ విజయంతో వచ్చే సీజన్లో ఎలైట్ గ్రూపునకు బిహార్ అర్హత సాధించింది. రంజీ ట్రోఫీలో జట్లను వాటి ప్రదర్శనల ఆధారంగా ఎలైట్(అగ్రశ్రేణి), ప్లేట్(దిగువ శ్రేణి) గ్రూపులుగా విభజిస్తారు.
News January 26, 2026
అండాశయ క్యాన్సర్‌కు కారణాలివే..

ఒవేరియన్ కేన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా దీని ప్రమాదం పెరుగుతుంది.


